పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి దుర్గా తేజ్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘బ్రో: ది అవతార్’. తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమా గతంలో రిలీజై పర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమా సీక్వెల్‌పై దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బ్రో 2’ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందన్నాడు. పవన్ ఎప్పుడు ఒకే అంటే.. అప్పుడే ఇది సెట్స్ మీదకు వెళ్తుందని తెలిపాడు.