MBNR: వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మిడ్జిల్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. వందేమాతరం గేయం ప్రాముఖ్యత గురించి తహసీల్దారు రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గీతాంజలి, అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి చాటారు.