»Good News For Students University Announced Period Leaves
Period Leaves: విద్యార్థులకు శుభవార్త..పీరియడ్ లీవ్స్ ప్రకటించిన యూనివర్శిటి
మహిళా విద్యార్థులకు ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్శిటీ పీరియడ్ సెలవులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆఫీసుల్లో కూడా అటువంటి లీవ్స్ ఇవ్వాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పీరియడ్స్ టైంలో మహిళలకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. భరించలేనంత నొప్పి వల్ల సరిగ్గా తినలేరు. కొందరైతే కనీసం టేబుల్‌పై ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోలేరు. ఆ సమయంలో స్కూల్‌కు, కాలేజ్‌కు, ఆఫీస్‌కు, మరేదైన పనికి వెళ్లాలంటే వారికి నరకంగా ఉంటుంది. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జబల్పూర్ లోని ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్శిటీ (DNLU) కీలక నిర్ణయం తీసుకుంది. తమ క్యాంపస్ లోని విద్యార్థినులకు రుతుక్రమ సెలవులను (Period Leaves) ప్రకటించింది.
రుతుస్రావం టైంలో స్త్రీలు విపరీతమైన నొప్పిని భరిస్తారు. కడుపు, చేతి నొప్పులు వారిని ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల బహిష్టు సెలవులను ప్రకటిస్తున్నారు. తాజాగా ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్శిటీ (Dharmasastra National Law Universities) కూడా తమ విద్యార్థులకు రుతుక్రమ సెలవులను (Period Leaves) ఇచ్చింది.
మహిళా విద్యార్థులంతా బహిష్టు సమయంలో అదనంగా సెలవులు పొందొచ్చు. సెలవులు మంజూరు చేసే అధికారం ఆ కళాశాల ప్రిన్సిపల్‌కు ఉందని సర్క్యూలర్‌లో వెల్లడించారు. ఈ సెలవులు (Period Leaves) ఇవ్వడంపై మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చినప్పటికీ విద్యార్థుల కృషి వల్లనే ఇది సాధ్యమైంది. ఇలాంటి లీవ్స్ ఇవ్వడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఆఫీసుల్లో కూడా ఈ లీవ్స్ కనీసం రెండు రోజులైనా ఇస్తే బావుంటుందని మరికొందరు సూచిస్తున్నారు.