»Flying Car A Car Flying In The Wind For Rs 2 46 Crores 500 Cars Booking
Flying Car : రూ.2.46 కోట్లకు గాల్లో ఎగిరే కారు..500 కార్లు బుకింగ్!
గాల్లో ఎగిరే కారును అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ కారు వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గనుంది. అంతేకాకుండా పర్యావరణానికి కూడా హాని కలగదు. త్వరలోనే ఈ ఏరోనాటిక్స్ కంపెనీ కారు అందుబాటులోకి రానుంది.
నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు (Trafic Problems) విపరీతంగా పెరిగాయి. ట్రాఫిక్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే గాల్లో ఎగిరిపోయి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనుకుంటున్నారు. తాజాగా ఆ కలే ఇప్పుడు నిజమైంది. ఎగిరే కారు (Flying Car) మార్కెట్లోకి త్వరలోనే రాబోతోంది. రోడ్డుపై దూసుకుపోతూనే ట్రాఫిక్ సమస్య వచ్చినప్పుడు గాల్లోకి ఆ వాహనం ఎగరనుంది. ఆ వాహనంతో ఎక్కడికైనా గాల్లో ఎగిరిపోవచ్చు.
గాల్లో ఎగిరిపోయే కారును (Flying Car) అమెరికా (America)లోని కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ అభివృద్ధి చేసింది. తాజాగా డెట్రాయిట్లో ఆటో షోను నిర్వహించారు. ఈ షోలో గాలిలో ఎగిరే కారును ప్రదర్శించగా అందరూ ప్రశంసలు కురిపించారు. 2023 జూన్ లోనే అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆ కారుకు అనుమతులను మంజూరు చేసింది.
ఈ ఏరోనాటిక్స్ కారులో (Aeronautics Car) ఇద్దరు ప్రయాణించొచ్చు. ఆ కారు ధర సుమారు రూ.2.46 కోట్లు అని అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ తెలిపింది. విద్యుత్ శక్తితో నడిచే ఆ కారు రోడ్డుపై 200 మైళ్ల వరకూ ప్రయాణిస్తుందని యాజమాన్యం వెల్లడించింది. గాలిలో ఆ కారు 110 మైళ్ల వరకూ ఎగురుతుంది. ఆ కారులో నుంచి 180 డిగ్రీల కోణంలో చూసే అవకాశం కూడా ఉంది.
అలెఫ్ ఏరోనాటిక్స్ (Alef Aeronautics) కంపెనీ 2022లోనే ఈ కార్లకు సంబంధించి ముందస్తు బుకింగ్స్‌ను ప్రారంభించింది. దీంతో ఇప్పటి వరకూ ఆ కారును 500 మంది వరకూ బుక్ చేసుకున్నారు. త్వరలోనే ఈ కార్లు వాడుకలోకి రానున్నాయి. ఈ అధునాతన సాంకేతిక కార్లు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య (Trafic Problems) పూర్తిగా తీరనుంది. ఈ కార్ల వల్ల పర్యావరణానికి (Environments) ఎటువంటి హాని ఉండదు.