»Sim Card Rules New Rules On Issuance Of Sim Card Violation Of Rs 10 Lakh Fine
SIM Card Rules: సిమ్ కార్డు జారీపై కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే రూ.10 లక్షల జరిమానా
సిమ్ కార్డులు తీసుకోవాలంటే ఇకపై పోలీసుల వెరిఫికేషన్ కచ్చితం. ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సంస్థ ప్రకటించింది. సిమ్ కార్డుల జారీలో నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 లక్షల వరకూ జరిమానాను విధించనున్నట్లు డాట్ సంస్థ తెలిపింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (Department Of Telecommunication) (డాట్) సిమ్ కార్డుల జారీపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సిమ్ కార్డులు విక్రయించేవారి విషయంలో డాట్ కఠిన నిబంధనలను (Rules) తీసుకొచ్చింది. ఆ రూల్స్ ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రధానంగా ఒకే నంబర్‌పై ఎక్కువ సిమ్ కార్డులు జారీ చేసేవారికి ఈ నిబంధనలు కఠినంగా ఉండనున్నాయి. దీని వల్ల కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం కలగనుంది.
గత కొంత కాలంగా డాట్ (DOT) సంస్థకు సిమ్ కార్డులపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. డాట్ నిబంధనల (DOT Rules) ప్రకారంగా సిమ్ కార్డుల వెరిఫికేషన్ (Sim Card Verification) ఇకపై పోలీసులు చేయనున్నారు. ప్రతి సిమ్ కార్డు దుకాణానికి ఒక కార్పొరేట్ ఐడీని ఇవ్వనున్నారు. ఆ ఐడీ లేకుండా సిమ్ కార్డును విక్రయించే ఛాన్స్ అస్సలు ఉండదు.
ఇకపోతే సిమ్ కార్డు (SIM Card) తీసుకోవడానికి కచ్చితంగా ఆధార్ (Adhar), పాన్, పాస్ పోర్ట్, జీఎస్టీ వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ (Registration) లేకుండా సిమ్ విక్రయిస్తే ఆ షాప్‌ను అధికారులు బ్లాక్ చేస్తారు. అంతేకాకుండా వారికి రూ.10 లక్షల వరకూ జరిమానాను (Rs.10 Lakshs Fine) విధించనున్నారు.
ఎవరైనా తమ సిమ్ కార్డును పోగొట్టుకుంటే కచ్చితంగా వారు కొత్త సిమ్ కార్డు కోసం వెరిఫికేషన్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. ఒకే నంబర్ మరొకరికి అనుమతి లేకుండా జారీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని డాట్ సంస్థ హెచ్చరించింది. సిమ్ కార్డుల ద్వారా గత కొన్ని రోజుల నుంచి అనేక మోసాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడానికే ఈ కఠిన నిబంధనలను తీసుకొచ్చినట్లుగా డాట్ వెల్లడించింది.