E.G: దేశభక్తి గీతం ‘వందేమాతరం’ రచించి 150 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు గోపాలపురం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సామూహిక వందేమాతరం గానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.