HNK: నగరంలో ప్రసిద్ధిచెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో కార్తీకమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు అమ్మవారికి అర్చకులు భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచి, పాలతో అభిషేకం చేసి, వివిధ రకాల పూలతో, పూలమాలలతో అలంకరించారు. భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి ఇచ్చారు.