కరేబియన్ సముద్రంలో మరో పడవపై అమెరికా దాడి చేసింది. డ్రగ్స్ రవాణా చేస్తున్న పడవపై ఈ దాడి జరిగిందని, ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. దీంతో మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న పడవలపై చేసిన దాడుల్లో ఇది 17వ దాడి అని తెలిపారు.