W.G: మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి సన్మార్గాన్ని చూపించి దేవునిపై భక్తి విశ్వాసాలను కల్గించే పవిత్ర పర్వదినం రంజాన్ అని పేర్కొన్నారు.