»Bandi Sanjay Is A Sawaal Challenge For Aimim Party In Karimnagar Bjp Office Attack
AIMIM పార్టీకి బండి సంజయ్ గట్టి సవాల్
మతపరమైన ఊరేగింపులో భాగంగా AIMIM, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ కరీంనగర్ ఆఫీస్ పై దాడికి ప్రయత్నించారని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. అలాంటి క్రమంలో వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుండా తమ పార్టీ నేతలను అరెస్టు చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
bandi sanjay is a sawaal challenge for aimim party in karimnagar bjp office attack
తెలంగాణా బీజేపీ నేత బండి సంజయ్ శనివారం కరీంనగర్ జిల్లాలోని తమ కార్యాలయం ముందు AIMIM కార్యకర్తలు తనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని విమర్శించారు. అంతేకాదు తన ఆఫీసు, ఇంటిపై దాడి చేయాలని ప్రయత్నించినా కూడా వారిపై చర్యలు తీసుకోవడం లేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి క్రమంలో ఆత్మరక్షణ కోసం యత్నించిన బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 50కి పైగా మోటర్బైక్ల ర్యాలీ చేశారని సంజయ్ అన్నారు. ఆ క్రమంలో కార్యాలయం వెలుపల ఏర్పాటు చేసిన బోర్డును ధ్వంసం చేసేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్, ఏఐఎంఐఎం కలిసి తెలంగాణను నాశనం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయని సంజయ్ ఆరోపించారు. ఈ సందర్భంగా నిజమైన దేశభక్తులతో ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. AIMIM పార్టీ ఏ దేశం పట్ల దేశభక్తిని ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు. భారత్ లేదా పాకిస్థాన్ దేశాల్లో మీ దేశభక్తి దేనికని అడిగారు. ఈ నేపథ్యంలో భారతదేశం పట్ల తమ దేశభక్తిని నిరూపించుకోవడానికి AIMIM పార్టీ కార్యకర్తలు, నేతలు జాతీయ గీతాన్ని ఆలపించి నిరూపించుకోవాలని సవాల్ చేశారు. అందుకు తమ కార్యకర్తలు, నేతలు సిద్ధమేనని, మీరు కూడా సిద్ధమేనా అంటూ ఛాలెంజ్ విసిరారు.
.Allegedly the same person was involved in stone pelting in 2018 on @bandisanjay_bjp‘s house and the same person organised and present in yesterday’s Miladunnabi rally.
Video of 2018 stone pelting after assembly election results.
అంతేకాదు ఇప్పటికే తమ పార్టీ తెచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును ముస్లింలందరూ అభినందిస్తున్నారని చెప్పారు. పాతబస్తీ మాదిరిగానే ఇప్పుడు మొత్తం ముస్లిం సమాజం మొత్తం బీజేపీకి మద్దతు పలుకుతోందన్నారు. అయితే అసలు మతపరమైన బైక్ ర్యాలీకి బీఆర్ఎస్ కార్యకర్తలను అనుమతించడంపై సంజయ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బీజేపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని ఈ సందర్భంగా కోరారు.