»World Cup Match In Hyderabad Telangana High Court Notice To Hca Pay 17 5 Crore To Visaka Industries
Hyderabad:లో వరల్డ్ కప్ మ్యాచ్..HCAకు గట్టి దెబ్బ
హైదరాబాద్‌లో మరికొన్ని రోజుల్లో ప్రపంచకప్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కు గట్టి షాక్ తగిలింది. దాదాపు 18 కోట్ల రూపాయలు విశాఖ ఇండస్ట్రీస్ కు ఆరు వారాల్లో చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
World Cup match in Hyderabad telangana high court notice to HCA pay 17.5 crore to visaka industries
విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు రూ.17.5 కోట్లు చెల్లించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)ని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌సీఏ ఆస్తులను అటాచ్ చేస్తూ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడాన్ని సవాల్ చేస్తూ హెచ్‌సీఏ దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 2004లో ఉప్పల్‌లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడగా విశాఖ ఇండస్ట్రీస్ HCAకు లోన్ ఇప్పించి స్పాన్సర్ షిప్ చేసుకుంది. అయితే ఆ తర్వాత HCA, విశాఖ మధ్య ఆ అగ్రిమెంట్ రద్దైంది. అయితే అప్పటి నుంచి 25 కోట్ల రూపాయలు తీర్చలేదని వడ్డీతో సహా చెల్లించాలని 2016లోనే కోర్టు ఆదేశించింది. విశాఖ ఇండస్ట్రీస్ తో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నందుకు గాను ఆ మొత్తాన్ని వారికే చెల్లించాలని స్పష్టం చేసింది. అయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని ఈ నేపథ్యంలో HCA బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..నిన్న తీర్పు వచ్చింది.
విశాఖ ఇండస్ట్రీస్ తరఫు సీనియర్ న్యాయవాది సునీల్ గను వాదనలు వినిపిస్తూ.. గత ఏడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని, ఈ కేసు రాత్రికి రాత్రే జరిగిన పరిణామం కాదని అన్నారు. మాకు చెల్లింపు చేయకుండా ఉండేందుకు హెచ్‌సీఏ ఉద్దేశపూర్వకంగానే దానిని విస్మరించిందని ఆయన అన్నారు. దీనిపై హెచ్‌సీఏ న్యాయవాది స్పందిస్తూ డిక్రీ చేసిన మొత్తంలో 50 శాతం ఆరు నెలల్లో చెల్లిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ మూడు ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉందని, ఈ క్రికెట్ మ్యాచ్‌లకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి హెచ్‌సిఎ ఆస్తులు, బ్యాంకు ఖాతాలను డిఫ్రీజ్ చేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. హెచ్‌సీఏ ఆస్తులను అటాచ్ చేస్తూ, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ వాణిజ్య న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరు పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం బ్యాంకు ఖాతా, ఇతర ఆస్తులను స్తంభింపజేసి, 6 వారాల్లోగా 17.5 కోట్ల రూపాయలను కమర్షియల్ కోర్టు ముందు జమ చేయాలని హెచ్‌సీఏను ఆదేశించింది.