E.G: నిడదవోలు(M) తాడిమల్ల గ్రామంలో శుక్రవారం రాత్రి సమిశ్రగూడెం పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.6,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు కొనసాగిస్తున్నట్లు SI సుందర్ బాలాజీ తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.