కబేళాలకు ఇస్కాన్ గోవులను అమ్ముకుంటోందని ఆరోపణ చేసిన ఎంపీ మేనకా గాంధీ (MP Maneka Gandhi)పై ఇస్కాన్ సంస్థ తీవ్రంగా పరిగణించింది. ఆమెపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఆమె వ్యాఖ్యలు భక్తులను తీవ్రంగా గాయపరిచాయిని. ఈ నేపథ్యంలో నోటీసులను కోల్కతా ఇస్కాన్ (ISKCON) ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ పంపించారు.మేనకా గాంధీ కామెంట్స్ దురదృష్టకరమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తులను ఆమె వ్యాఖ్యలు బాధించాయని, ఆమెకు వంద కోట్ల పరువు నష్టం నోటీసులు పంపించామన్నారు. ఆమె చేసిన నిరాధార ఆరోపణలపై తాము అన్ని విధాలుగా న్యాయపరంగా పోరాడుతామన్నారు.
ఇస్కాన్ పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద సంస్థపై ఎలా ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. కబేళాలకు గోవుల్ని అమ్ముకుంటున్నారని, దేశంలో జరుగుతున్న అతిపెద్ద మోసమని బీజేపీ (BJP) ఎంపీ మేనకా గాంధీ అన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతన్న ఇస్కాన్, తమ గోశాలల్లో ఉన్న గోవుల్ని అమ్ముకుంటున్నట్లు మేనకా గాంధీ చేసిన ఆరోపణలనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇటీవల ఏపీలోని అనంతపురం (ATP) లో ఉన్న గోశాలను సందర్శించినట్లు ఆమె తెలిపారు.
చదవండి :
అక్కడ పాలు (Milk) ఇచ్చే ఆవు ఒక్కటి కూడా లేదని, దూడలు కూడా లేవని, మొత్తం డెయిరి(Dairy)లో ఒక్కటి కూడా పాలిచ్చే ఆవు లేదని, అంటే అక్కడ ఉన్న ఆవుల్ని అమ్ముకున్నారని తెలుస్తోందని ఆమె ఆరోపించారు. బీజేపీ ఎంపీ చేసిన తీవ్ర ఆరోపణల్ని ఇస్కాన్ ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుడువని ఇష్కాన్ పేర్కొన్నది. గోవులు(Cows), ఆవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుదిష్టర్ గోవింద దాస్ (Govinda Das) తెలిపారు. కేవలం ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా తాము గోవుల్ని ఆదరించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.