W.G: జిల్లాలో పర్యాటక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో టూరిజంపై మాట్లాడిన ఆమె, టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి గల ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ceo-apta@ap.gov.in మెయిల్ ఐడీకి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.