JNG: పాలకుర్తి మండలం నర్సింగాపురం గ్రామ పరిధి మొర్చుగడ్డ తండాకు చెందిన కేతావత్ యాకూబ్ ఇంటిపై పిడుగుపడి క్షణాల్లో దగ్ధమైంది. ఇంట్లోని సామాను, గృహోపకరణాలు అన్నీ మంటల్లో కాలిపోయాయి. స్థానిక సర్పంచ్ విషయాన్ని MLA యశస్విని రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన MLA బాధితునితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చూస్తానన్నారు.