SKLM: కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని, వారి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ విమర్శించారు. శనివారం శ్రీకాకుళంలోని స్థానిక క్రాంతి భవన్లో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు.