ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అప్పర్ పెన్నార్కు నీరందించే సాగునీటి పథకం కాలువ పనులను పరిశీలించారు. కనగానపల్లి, రామగిరి మండలాల పరిధిలో జరుగుతున్న ఈ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివపురం కొట్టాల గ్రామంలో రూ.90 లక్షల ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డును తనిఖీ చేశారు.