VZM: మహాశివరాత్రి సందర్భంగా రామతీర్థం, పుణ్యగిరి ఆలయాల్లో భక్తుల క్యూలైన్ నిర్వహణలో సహకరించిన ఎన్సీసీ విద్యార్థులను ఎస్పీ దామోదర్ తన కార్యాలయంలో శనివారం అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, భవిష్యత్తుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎన్సీసీ ద్వారా సేవాభావం పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.