BPT: జిల్లాలో నిషేధిత భూముల 22ఏ జాబితా నుంచి చట్టబద్ధంగా తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 530 ఎకరాల భూమిని జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 1,406 దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.