అన్నమయ్య: మదనపల్లె(మం) చీకుల బైలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు(భువనేష్ రెడ్డి-6, కుశిల్ రెడ్డి-10)మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. తండ్రి శివారెడ్డితో సహా మరో బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలను శ్రీరామ్ చిన్నబాబు పరామర్శించారు.