NGKL: చారకొండ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ స్తూప నిర్మాణానికి స్థలం కేటాయించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు శుక్రవారం సర్పంచ్ విజేందర్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన సర్పంచ్, స్తూప నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మల్లేశ్, వెంకటయ్య గౌడ్, మల్లికార్జున పాల్గొన్నారు.