SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లపై ఈవో ఎల్.రమాదేవి శుక్రవారం సమీక్షించారు. ఆలయ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కల్యాణోత్సవానికి భారీగా తరలివచ్చే భక్తులకు తాగునీరు నీడ, క్యూలైన్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు.