ADB: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులకు కలెక్టర్ రాజర్షి షా శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దానగుణం, భక్తి భావాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ఈ పండుగ సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.