TG: రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.1,09,400 కోట్లు ఖర్చు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. రైతు కేంద్రిత పాలనలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని స్పష్టం చేశారు.