SRCL: సిరిసిల్ల కలెక్టరేట్ జంక్షన్లో చేనేత అస్తిత్వానికి గుర్తింపుగా ‘జోటా’ మరమగ్గపు పరికరం చిహ్నాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రూ.3 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా దీనిని రూపొందించారు. గతంలో ఏర్పాటు చేసిన నేతన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాల తరహాలోనే, వస్త్ర పరిశ్రమ ప్రాధాన్యతను చాటేలా ఈ జోటా చిహ్నం పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.