VZM: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలని ఎస్పీ దామోదర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన నార్కోటిక్ కో-ఆర్డినేషన్ కమిటీ జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు.