ATP: రంజాన్ పండగ పురస్కరించుకుని ఇంటర్ ప్రథమ విడత స్పాట్ వాల్యుయేషన్ రిపోర్టింగ్‌ను వాయిదా వేశారు. ఈనెల 21న జరగాల్సిన ప్రక్రియను 22కు మార్చినట్లు అనంతపురం క్యాంప్ ఆఫీసర్ వెంకటరమణ నాయక్ తెలిపారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్స్, జూనియర్ లెక్చరర్లు కొత్త తేదీ ప్రకారం హాజరు కావాలని సూచించారు.