రాత్రి పూట సూర్యకాంతిని అందిస్తామంటూ అమెరికాకు చెందిన ఓ సంస్థ చెబుతోంది. ఈ ప్రతిపాదన కింద నేల నుంచి 600-625 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెడతారు. టెర్మినేటర్ లైన్‌గా పిలిచే రాత్రి-పగలు సరిహద్దు రేఖలో అవి స్థిరంగా పరిభ్రమిస్తుంటాయి. అవి సూర్యకాంతిని ఒడిసిపట్టి భూమి మీద నిర్దిష్ట ప్రదేశాలకు బట్వాడా చేస్తాయి.