ADB: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్లో కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ శుక్రవారం అన్నారు. అంగన్వాడీ, ఆశా, గ్రామపంచాయితీ, మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. వారి జీతాల పెంపుదల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు.