KDP: పులివెందుల గోపి విహార్ స్ట్రీట్, భాకరాపురం ప్రాంతాలలో మురికినీటిలో శుక్రవారం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సిద్దయ్య, వైద్య ఆరోగ్య సిబ్బంది దోమల నిర్మూలనకు ఆయిల్ బాల్స్ విడుదల చేశారు. లార్వాదశలోనే దోమలను అంతం చేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని వారు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.