అన్నమయ్య: ఉగాది సందర్భంగా ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. దీనికి కృతజ్ఞతగా రైల్వేకోడూరు టౌన్ పరిధిలో తెలుగు యువత నాయకులు శుక్రవారం ఆయనకు పాలాభిషేకం నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని కోడూరు పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.