SKLM: మూలపేట పోర్టును ఈనెల 30న సందర్శించనున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ తెలిపారు. ఈమేరకు పాతపట్నం నియోజకవర్గ నేతలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో కలిసి పోర్టును సందర్శించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.