Nagababu: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖాయం.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీతో కలిసి పనిచేయడానికి జనసేన క్యాడర్ సిద్ధంగా లేదు. టీడపీ నేతలు గతంలో తమను టార్చర్ పెట్టారని.. మళ్లీ కలిసి పనిచేయలేం అంటున్నారు. చిత్తూరు పర్యటనలో జనసేన నేత నాగబాబు (Nagababu) ఉండగా.. ఆయనకు క్యాడర్ నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.
గతాన్ని మరచిపోయి ముందుకు వెళ్లాలని నాగబాబు సూచించారు. అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పటి సిచుయేషన్ వేరని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జనసేన కింద పనిచేయాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు ఉన్నప్పటికీ టీడీపీ నేతలు మన కింద పనిచేయాలని అన్నారు. టీడీపీతో కలిసి పనిచేసిన జనసేన అజెండానే తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ సీఎం అవుతారని నాగబాబు కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ చర్చకు దారితీశాయి. స్కిల్ స్కామ్ నేపథ్యంలో చంద్రబాబు జైలుకు వెళ్లగా.. రేపో మాపో లోకేశ్ అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. సో.. పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి అని.. ముఖ్యమంత్రి అవుతారని నాగబాబు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందించాల్సి ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ- జనసేన కలిసి పనిచేయాల్సి ఉందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన క్యాడర్ మాత్రం అసంతృప్తిగా ఉంది. వారిలో జోష్ నింపేలా ఈ రోజు నాగబాబు మాట్లాడారు.