వేసవి కాలంలో ఉష్టోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. అయితే వడ దెబ్బను కొన్ని లక్షణాలతో ప్రారంభంలోనే గుర్తించవచ్చు. లేకుంటే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఆ లక్షణాలు ఏంటంటే.. నిరంతర తలనొప్పి, తీవ్రమైన దాహం, నోరు పొడిబారడం, చెమట తగ్గడం లేదా ఆగిపోవడం, గందరగోళం, చిరాకు, తల తిరగడం, వికారం, కండరాల తిమ్మిర్లు.