GNTR: పొన్నూరు డంప్యార్డ్లో పేరుకుపోయిన అరటి వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. అరటి తొండమాలను చిన్న ముక్కలుగా చేసే ‘బనానా స్టెమ్ కట్టర్’ యంత్రం కొనుగోలుకు ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ రూ.25 వేల విరాళాన్ని మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబుకు అందజేసింది. ఈ యంత్రం ద్వారా వ్యర్థాలను ఎరువుగా మార్చవచ్చని, తద్వారా తరలింపు సులభమవుతుందని అధికారులు తెలిపారు.