TG: బడ్జెట్లో నిరుద్యోగుల ప్రస్తావనే లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేలా ఉందని విమర్శించారు. రైతు భరోసా, ఆరు గ్యారెంటీల అమలుకు స్పష్టమైన కేటాయింపులు లేవని.. ఇది ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఇది కేవలం అంకెల గారడీ బడ్జెట్ అని మండిపడ్డారు.