కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రామచంద్రపురంలో ఉన్న ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారుల పాల్గొన్నారు.