GNTR: గుంటూరు మాన్సూన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా నగరంలోని ప్రధాన, అంతర్గత డ్రైన్ల పూడికతీతను మే నెలలోపు 100% పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఆక్రమణలపై వారం రోజుల్లో సర్వే నిర్వహించాలని సూచించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించాలన్నారు.