TG: నక్సలిజం అంతం, లొంగుబాట్లపై ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. బడ్జెట్లో హోంశాఖకు రూ.11,907 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సమగ్ర సంక్షేమం, ఉపాధి ద్వారానే నిజమైన మార్పు సాధ్యమని తమ ప్రభుత్వం నిరూపించిందన్నారు. BRS హయాంలో 347 మంది మావోయిస్టులు లొంగిపోతే, తమ ప్రభుత్వంలో 732 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు భట్టి ప్రకటించారు.