AP: పండుగ పూట ప్రజలకు మేలు జరగాలని కాకుండా కేవలం జగన్ బాగుండాలని కోరుకోవడం వైసీపీ నైజమని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. వైసీపీ హయాంలో నిరుద్యోగం 24 శాతానికి చేరిందని తెలిపారు. 4,100 మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారని.. NCRB నివేదికలు చెబుతున్నాయని వెల్లడించారు. దివ్యాంగుల పెన్షన్ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు టీడీపీ పెంచిందని గుర్తు చేశారు.