ATP: ఉగాది పండుగను పురస్కరించుకొని తాడిపత్రి నియోజకవర్గంలోని కోటకొండ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.