NDL: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందన్న ప్రచారాన్ని ఖండించారు. ప్రజలు అనవసరంగా ముందస్తు బుకింగ్స్ చేయవద్దని సూచించారు. ఆసుపత్రులు, అంగన్వాడీలు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. అధిక ధరలు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైన సమస్య ఉంటే 1967కు ఫిర్యాదు చేయాలన్నారు.