KRNL: కూటమి ప్రభుత్వం ప్రకటించిన 10,060 ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ యువతకు చారిత్రాత్మక కానుక అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పేర్కొన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కొనియాడారు. మే నుంచి అక్టోబర్ వరకు వివిధ శాఖల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.