SKLM: కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిని మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న చికిత్సలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడి, వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.