»Father And Son Killed In Old Rivalry In Sardaha Bazar Maharajganj Police Station Area
Uttar Pradesh : కస్టమర్ల విషయంలో గొడవ.. తండ్రీ కొడుకులు దారుణ హత్య
ఘర్షణలో చనిపోయిన తండ్రీ కొడుకులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. రషీద్, దినేష్‌లకు సర్దాహా మార్కెట్లో ఎదురుగా బట్టల దుకాణం ఉంది. కస్టమర్ల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లోని మహారాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత శత్రుత్వం కారణంగా రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన తండ్రీకొడుకులు.. ఎదుటి వారు పేల్చిన తూటాలకు గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. రెండు వర్గాల మధ్య జరిగిన వ్యవహారం కావడంతో సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘర్షణలో చనిపోయిన తండ్రీ కొడుకులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. రషీద్, దినేష్‌లకు సర్దాహా మార్కెట్లో ఎదురుగా బట్టల దుకాణం ఉంది. కస్టమర్ల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బుధవారం ఉదయం ఏదో అంశంపై ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఈ సందర్భంగా దినేష్ వైపు నుంచి కాల్పులు జరిగాయి. బుల్లెట్ 55 ఏళ్ల రషీద్, అతని 22 ఏళ్ల కుమారుడు షోయబ్‌ను తాకింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.
ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు వర్గాల మధ్య వివాదం నెలకొనడంతో ఎస్పీ అనురాగ్ ఆర్య స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మార్కెట్లో మోహరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మహరాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని సర్దాహా మార్కెట్లో తండ్రీకొడుకులు కాల్చి చంపారని.. గుప్తా దుకాణం విషయంలో వారిద్దరికీ పాత వివాదం ఉందని అజంగఢ్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అఖిలేష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చర్యలు తీసుకుంటామన్నారు.