TG: గవర్నర్ కోటా MLCలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. హైకోర్టు విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసి, శాసనమండలి సమావేశాల్లో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలన్న వారి విన్నపాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. ముందుగా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.