MBNR: ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త అందించారు. తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదాబైనామా భూసమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలపడం లక్ష్యమన్నారు. ఈ ప్రకటనతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పట్టాల కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.