BDK: చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన అశోక్ కుమార్ రెడ్డి ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాన్ని నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు తగలబెట్టేరని వాపోయారు. వారి కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం కోసమే ఈ ఘటనకు పాల్పడ్డారని ఈ ఘటనకు పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులను పోలిస్ శాఖ కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులకు ఆశ్రయించినట్లు ఆయన వెల్లడించారు.