WGL: భద్రకాళి ఆలయ అర్చకుడు, వేద పండితులు సత్యమయ్యకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్తమయ్యను శాలువతో సన్మానించారు.