»Educational Institutions Are Closed Till September 24th 2023 Kerala Kozhikode District
Nipah virus effect: సెప్టెంబర్ 24 వరకు విద్యాసంస్థలు బంద్
కేరళ(kerala)లో నిఫా వైరస్(nipah virus) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధి ప్రభావం కోజికోడ్ జిల్లాలో ఎక్కువగా ఉన్న క్రమంలో పాఠశాలలు, కళాశాలలకు ఈ ప్రాంతంలో సెప్టెంబర్ 24 వరకు సెలవులను ప్రకటించింది.
Educational institutions are closed till September 24th 2023 kerala kozhikode district
కేరళ(kerala)లోని కోజికోడ్(kozhikode)లో నిఫా వైరస్(nipah virus) కలకలం రేపుతోంది. కేసుల సంఖ్య ఆరుకు చేరుకోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కోజికోడ్ జిల్లాలో పాఠశాలలు, కళాశాలలకు సెప్టెంబర్ 24 వరకు సెలవులు పొడిగించింది. ఈ మూసివేత ఆర్డర్ పాఠశాలలు, కళాశాలలు, ట్యూషన్ సెంటర్లతో సహా అన్ని విద్యా సంస్థలకు వర్తిస్తుందని తెలిపింది. అయితే ఆన్లైన్ తరగతులు వారం పొడవునా కొనసాగుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యాసంస్థలకు చేరుకోకూడదని సూచించారు. పబ్లిక్ పరీక్షలు యథాతథంగా ఉంటాయన్నారు. జిల్లాలో జరగాల్సిన పరీక్షల వాయిదాకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని కోజికోడ్ కలెక్టర్ తెలిపారు. బేపూర్ నౌకాశ్రయం, ఓడరేవు ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్నందున తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని మూసివేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ వైరస్(virus) కారణంగా ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తుల కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రస్తుతం 1,080 మంది ఉన్నారని అధికారులు ప్రకటించారు. వీరిలో 327 మంది రోగులు ఆరోగ్య కార్యకర్తలు ఉన్నట్లు చెప్పారు. వీరిలో 175 మంది రోగులు, 122 మంది ఆరోగ్య కార్యకర్తలు హై-రిస్క్ కేటగిరీలోకి వస్తారని వెల్లడించారు. ఈ క్రమంలో కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారి సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉందని మంత్రి జార్జ్ అన్నారు. వైరస్ సోకిందని శుక్రవారం ధృవీకరించబడిన ఆరవ వ్యక్తికి సంబంధించి కాంటాక్ట్ ట్రేసింగ్ను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.